ముంబై లో 36 గంటలుగా భారీ వర్షం

- September 04, 2019 , by Maagulf
ముంబై లో 36 గంటలుగా భారీ వర్షం

ముంబైలో మరోసారి ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుండి నగరంలో కుండపోత వర్షం కురుస్తుండంతో నగరమంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అయితే ఇదే వర్షం మరో ఇరవై నాలుగు గంటల పాటు కురుస్తుందనే వాతవరణ శాఖ ప్రకటనతో రానున్న ఇరవై నాలుగు గంటలు రెండ్ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో రానున్న రెండురోజుల పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించారు.గత 24 గంటలుగా మహారాష్ట్రలో ఎడతెరపిలేని వర్షం కురస్తోంది. దీంతో జనజీవనం స్థంబించి పోయింది.వాతవరణ శాఖ అంచనాల ప్రకారం మొత్తం 150 వాతవరణ సెంటర్లలలో 100 స్టేషనల్లో 200 మీమీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఈనేపథ్యలోంలో గత సెప్టెంబర్‌లో కురిసిన వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైనట్టు వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలోనే ముంబయి నగర వీధులు పూర్తిగా జలయమం అయ్యాయి. దీంతో పలు స్కూళ్లకు సెలవును ప్రకటించారు. మరోవైపు ట్రాఫిక్ కూడ నెమ్మదిగా వెళుతున్నట్టు అధికారులు తెలిపారు. వర్షం సందర్భంగా పలు రైళ్లు, విమానాలు రద్దయ్యాయి.

మరోవైపు మిథి నది పరివాహక ప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్తగా ఇతర ప్రాంతాలకు తరలించారు. నగరంలో పునరావాస చర్యలు చేపట్టారు.అయితే సముద్ర తీరంతో పాటు నీటీ ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ప్రయాణించకూడదని వాతవరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు విపత్తు నివారణ కోసం టోల్ ఫ్రి నంబర్ 1916 నంబర్‌ను కేటాయించి ప్రజలను అప్రమత్తం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com