వీరిని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్ర హోంశాఖ
- September 05, 2019
మసూద్ అజర్, హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రహీం, జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీలను ఉగ్రవాదులుగా ప్రకటించింది కేంద్ర హోంశాఖ. కొత్తగా సవరించిన యూఏపీఏ చట్టం కింద వీరిని టెర్రరిస్టులుగా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఓ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టంలోని తొలి షెడ్యూల్ ప్రకారం జైషే సంస్థపై నిషేధం ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది.
అజర్ నేతృత్వంలోని జైషే సంస్థ భారీ స్థాయిలో ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ నిర్వహిస్తోందని కేంద్రం వెల్లడించింది. అజర్‌పై అనేక కేసులు ఉన్నాయని, ఎన్ఐఏ లాంటి సంస్థలు ఆ కేసులను దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను సైతం ఉగ్రవాదిగా ప్రకటించింది కేంద్రం. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి అతన్ని గ్లోబల్ టెర్రరిస్టుగా ముద్ర వేసిందన్న కేంద్ర హోంశాఖ ఇప్పుడు యూఏపీఏ చట్టం కింద కూడా అతన్ని ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది.
ఇక లష్కరే తోయిబాకు చెందిన హఫీజ్ సయీద్‌పైన కూడా నాలుగు కేసులు ఉన్నాయి. ఎర్రకోటపై దాడి, రాంపూర్ అటాక్, ముంబై దాడులు, ఉదంపూర్‌లో బీఎస్ఎఫ్ కాన్వాయ్‌పై దాడి కేసులన్నీ హఫీజ్‌పై నమోదు అయ్యాయి. అటు జకీఉర్ రెహ్మాన్ లఖ్వీని సైతే ఉగ్రవాదిగా ప్రకటించింది హోంశాఖ.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







