యూఏఈలో అందుబాటులోకి మరో 3డి జీబ్రా క్రాసింగ్
- September 05, 2019
రస్ అల్ ఖైమా పోలీస్, ఎమిరేట్‌లోని పలు ప్రాంతాల్లో త్రీడీ జీబ్రా క్రాసింగ్స్‌ని ఏర్పాటు చేసే పనుల్ని వేగవంతం చేస్తున్నారు. ఎమిరేట్‌లో తొలి త్రీడీ జీబ్రా క్రాసింగ్ షేక్ మొహమ్మద్ బిన్ సలెమ్ రోడ్డుపై ఏర్పాటు చేశారు. యూకే మరియు ఇండియా తదితర దేశాల్లో ఈ విధానం కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. పెడెస్ట్రియన్ లైన్స్ వద్ద వాహనాలు వేగం తగ్గించడానికి ఈ త్రీడీ ముద్రిత జీబ్రా లైన్స్ ఉపయోగపడతాయి. రన్ ఓవర్ యాక్సిడెంట్లను ఈ త్రీడీ ముద్రిత జీబ్రా క్రాసింగ్స్ తగ్గిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, రోడ్లను దాటే పాదచారులు రోడ్డుపై వేగంగా వచ్చే వాహనాల పట్ల అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు అధికారులు. ఆర్టికల్ 43 ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం, పాదచారులకు ప్రాధాన్యమివ్వకుండా వాహనాలు నడిపేవారికి 500 దిర్హామ్‌ల జరీమానా, ఆరు బ్లాక్ పాయింట్స్ విధిస్తారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







