నడిచి వెళుతూ కుప్పకూలిపోయిన వ్యక్తి

- September 06, 2019 , by Maagulf
నడిచి వెళుతూ కుప్పకూలిపోయిన వ్యక్తి

అబుదాబీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఓ వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలిపోయిన ఘటన అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఊహించని ఈ ఘటనతో అక్కడున్నవారంతా ఆందోళన చెందారు. వెంటనే అతని వద్దకు చేరుకుని, అతనికి ప్రాథమిక చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. అనంతరం అథారిటీస్‌కి సమాచారం అందించడంతో, అంబులెన్స్‌ అక్కడికి చేరుకుని, ఆ వ్యక్తికి వైద్య సహాయం అందించినట్లు తెలుస్తోంది. అత్యవసర వైద్య చికిత్స అనంతరం ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com