దుబాయ్ లో ఘనంగా గణేష్ ఉత్సవాలు
- September 07, 2019
దుబాయ్:బాధ్రపద మాసం శుద్ద చవితి నాడు ప్రథమ పూజ్యుడైన వినాయకుని చవితి వేడుకలను సోమవారం జెబెల్ అలీ లోని 'బు హలీబా' వర్కర్స్ క్యాంపు లో ఘనంగా ప్రారంభించారు.క్యాంపు ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో గణ నాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ వర్కర్స్ క్యాంపు లో మన తెలుగు రాష్ట్రాలకు సంభందించిన కార్మికులు ఎక్కువగా నివసిస్తున్నారు.ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు.ఏర్పాటుచేసిన గణనాధుని ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకర్షించింది.
గత 6 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు.గత శుక్రవారం చివరిరోజున యూ.ఏ.ఈ లోని పలు ప్రాతాలనుంచి 5000 మంది పైగా భక్తులు దర్శించుకున్నారు మరియు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.సాయంత్రం నిమర్జనంలో 100 మంది పైగా కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.





తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







