ఎఫ్ఏటీఎఫ్ సమీక్షతో తేలనున్న పాక్ భవితవ్యం

- September 08, 2019 , by Maagulf
ఎఫ్ఏటీఎఫ్ సమీక్షతో తేలనున్న పాక్ భవితవ్యం

ఇస్లామాబాద్‌: ఉగ్ర సంస్థలకు నిధులు అందకుండా, అక్రమ నగదు చలామణిని అరికట్టేందుకు పాక్‌ చేపడుతున్న చర్యలను ఎఫ్‌ఏటీఎఫ్‌ వచ్చే వారం పరిశీలించనుంది. పాక్‌ ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్టు తేలినట్టయితే దానిని నిషేధిత జాబితాలో (బ్లాక్‌ లిస్ట్‌) చేర్చే అవకాశం ఉంది. 'ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌' అధికారులను కలవడానికి పాకిస్థాన్‌ ప్రతినిధి బృందం శనివారం బ్యాంకాక్‌ నగరానికి వెళ్లనుంది. సెప్టెంబర్‌ 8 నుంచి 10 వరకు జరగనున్న చర్చల్లో ఉగ్రవాదులకు నిధులు అంద కుండా పాక్‌ చేపడుతున్న చర్యలను ఎఫ్‌ఏటీఎఫ్‌ అధికారులకు ఈ బృందం వివరించనుంది అని పాక్‌ స్టేట్‌ మీడియా పేర్కొంది. ఎఫ్‌ఏటీఎఫ్‌ అడిగే 100 అదనపు ప్రశ్నలకూ ఈ బృందం సమాధానాలు ఇవ్వనుందని తెలిపింది. ఆగస్టు 18 నుంచి 23 వరకు ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో ఇంటర్‌ గవర్నమెంటల్‌ ఆర్గనైజేషన్‌ వార్షిక (ఆసియా-పసిఫిక్‌) సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉగ్రవాద నిరోధానికి తాము చేపడుతున్న 27 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక సమ్మతి నివేదికను పాక్‌ ఏఎఫ్‌టీఎఫ్‌కు సమర్పించింది. పాక్‌ నివేదికను సమూలంగా అధ్య యనం చేసిన తర్వాత దీన్ని ప్రస్తుతమున్న గ్రే లిస్టు నుంచి బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలా ? వద్దా ? అనే అంశంపై ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్ణయం తీసుకోనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com