రాష్ట్రపతి కోవింద్ విదేశీ పర్యటనపై భారత్ విజ్ఞప్తికి పాక్ నిరాకరణ
- September 08, 2019
ఇస్లామాబాద్: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విదేశీ పర్యటన కోసం తమ గగనతలాన్ని వినియోగించుకొనేందుకు పాకిస్థాన్ నిరాకరించింది. ఐస్‌ల్యాండ్, స్విట్జర్లాండ్, స్లొవేనియా దేశాల్లో రాష్ట్రపతి కోవింద్ మూడురోజుల పర్యటన సోమవారం నుంచి మొదలుకానున్నది. తన పర్యటనలో భాగంగా ఆయాదేశాల ముఖ్యనేతలతో రాష్ట్రపతి భేటీకానున్నారు. పుల్వామా దాడిసహా ఇటీవల దేశంలో పెరిగిన ఉగ్రవాద ఘటనలను వారిదృష్టికి కోవింద్ తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రపతి కోవింద్ ప్రయాణించే విమానం పాక్ గగనతలం మీదుగా ఐస్‌ల్యాండ్ వెళ్లేందుకు అనుమతించాలని భారత్చేసిన విజ్ఞప్తిని తమ ప్రభుత్వం తోసిపుచ్చినట్టు పాక్ విదేశాంగమంత్రి షా మహ్మద్ ఖురేషి శనివారం మీడియాకు చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తమ గగనతలాన్ని భారత్ వినియోగించుకొనే అవకాశం ఇవ్వరాదనే నిర్ణయానికి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం, దీనికి ప్రతిగా బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడులు చేయడంతో గత ఫిబ్రవరి 26న పాకిస్థాన్ తమ గగనతలాన్ని మూసివేసింది. జూలై 16న గగనతలాన్ని తెరిచినప్పటికీ భారత విమానాలపై మాత్రం నిషేధాన్ని అమలుచేస్తున్నది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!