ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ నేత రామ్ జఠ్మలానీ కన్నుమూత
- September 08, 2019
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నేత రామ్ జఠ్మలానీ(95) ఆయన నివాసంలో కన్నుమూశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా పనిచేశారు. ముంబయి నుంచి బీజేపీ అభ్యర్థిగా 6, 7 లోక్ సభలకు ఎన్నికయ్యారు. వాజ్పాయీ హయాంలో న్యాయ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2010లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా కొనసాగుతున్న జఠ్మలానీ ఎన్నో వివాదాస్పద కేసులను వాదించారు. అరుణ్‌జైట్లీ - కేజ్రీవాల్ పరువునష్టం కేసులో కేజ్రీవాల్ తరపున వాదించారు. 1923 సెప్టెంబర్ 14వ తేదీన బాంబే ప్రెసిడెన్సీలో రామ్ జఠ్మాలనీ జన్మించారు. 17 ఏళ్ల వయస్సులోనే బాంబే యూనివర్సిటీలో ఎల్ఎస్బీ చేశారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీని తీవ్రంగా విమర్శించారు. రామ్ జఠ్మాలనీకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రామ్ జఠ్మాలాని మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. వివిధ హోదాల్లో ఆయన చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!