భారత వలసదారుడ్ని కలిసిన షేక్‌ మొహమ్మద్‌

- September 11, 2019 , by Maagulf
భారత వలసదారుడ్ని కలిసిన షేక్‌ మొహమ్మద్‌

యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, ఓ భారతీయ వలసదారుడ్ని కలిశారు. ఆ భారతీయ వ్యక్తి పేరు దివ్యాంక్‌ టురాకియా. యాడ్‌ టెక్‌ కంపెనీ ఫౌండర్‌ మరియు సీఈఓ అయిన దివ్యాంక్‌, తన సంస్థను 3.3 బిలియన్‌ దిర్హామ్‌లకు విక్రయించారు. ఈ నేపథ్యంలో షేక్‌ మొహ్మద్‌, దివ్యాంక్‌ని కలిశారు. దుబాయ్‌, మిడిల్‌ ఈస్ట్‌లో సిలికాన్‌ వ్యాలీగా మారుతోందని చెప్పారు. ఇటీవలి కాలంలో దుబాయ్‌ ఈ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందనీ, మల్టీ బిలియన్‌ టెక్‌ డీల్స్‌, దుబాయ్‌ ఇమేజ్‌ని మరింత పెంచుతున్నాయని అన్నారాయన. దుబాయ్‌ ముందు ముందు మరింతగా టెక్‌ విభాగంలో దూసుకుపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com