కుల్‌భూషణ్ జాదవ్ విషయంలో పాక్ కాఠిన్యం
- September 12, 2019
న్యూఢిల్లీ: భారత నావికా దళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ విషయంలో పాకిస్తాన్ తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశమైంది. రెండోసారి కుల్‌భూషణ్‌ను కలిసేందుకు భారత దౌత్య కార్యాలయ అధికారులకు అవకాశం ఇవ్వబోమని పాక్ తేల్చి చెప్పింది. ఈ మేరకు పాక్ విదేశాంగ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 2న కుల్‌భూషణ్‌ను కలిసేందుకు అనుమతి లభించిన విషయం విదితమే. పాక్ జైలులో ఉన్న జాదవ్‌తో భారత డిప్యూటీ హై కమిషనర్ గౌరవ్ అహ్లువాలియా సెప్టెంబర్ 2న గంట పాటు భేటీ అయ్యారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై చర్చించారు. గూఢచర్యం ఆరోపణలతో కుల్‌భూషణ్‌కు పాక్ మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2016, మార్చి 3న జాదవ్‌ను బలూచిస్తాన్‌లో పాక్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. కుల్‌భూషణ్‌ను కాపాడేందుకు భారత్ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కుల్‌భూషణ్‌ను కలిసేందుకు మరోమారు అనుమతి ఇవ్వబోమంటూ పాక్ చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు