యురేనియం తవ్వకాలపై మంత్రి కేటీఆర్ ప్రకటన
- September 15, 2019
హైదరాబాద్: యురేనియం తవ్వకాలపై శాసనమండలిలో మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు. యురేనియం నిక్షేపాల కోసం నల్గొండ జిల్లాలో అన్వేషణ చేపట్టాం కానీ.. నాగర్‌కర్నూల్- అమ్రాబాద్ ప్రాంతంలో ఎలాంటి అన్వేషణ చేపట్టలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. యురేనియం నిక్షేపాల కోసం రాష్ట్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు. యురేనియం నిక్షేపాలు ఉన్నా అనుమతులు ఇవ్వబోమని, వన్యప్రాణుల సంరక్షణ విభాగం స్పష్టం చేసిందని మండలిలో కేటీఆర్ పేర్కొన్నారు. మైనింగ్‌లో రెండు దశలుంటాయని, తొలి దశలో అన్వేషణ చేస్తారని కేటీఆర్ అన్నారు. ప్రాథమిక దశలో జియాలజిస్టులు అధ్యయనం చేస్తారని, యురేనియం ఉందనే అంచనాకు వచ్చిన తర్వాతే అన్వేషణ, కేంద్రం పరిధిలోని ఏఎండీ ఆధ్వర్యంలో ప్రక్రియ జరుగుతుందన్నారు. మైనింగ్ చేయాలా.. వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, యురేనియంపై రాష్ట్రప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. యురేనియం శుద్ధి చేసే వరకు ఎలాంటి రేడియేషన్ వెలువడదన్నారు. అన్వేషణ దశలోనే కృష్ణా జలాలు కలుషితమైనట్టు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలోని లంబాపూర్, పెద్దగట్టు, చిత్రియాల్‌లో 1992-2012 కాలంలో ఎఎండీ యురేనియం అన్వేషణ చేపట్టిందన్నారు. 18 వేల 550 మెట్రిక్ టన్నుల యురేనియం నిక్షేపాలు ఉన్నాయని కనుగొన్నారు. హైదరాబాద్‌లోని డీఏఈ, ఏఎండీ తరపున సాగర్ డబ్ల్యూఎల్‌లోని చింత్రియాల్లో 50 చ.కి.మీ పైబడి సర్వే చేసిందని కేటీఆర్ తెలిపారు. బోర్లను తవ్వడం కోసం అటవీశాఖ ఉన్నతాధికారికి 2012లో ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, నల్లమలలో యురేనియం నిక్షేపాలు ఉన్నా వాటిని వెలికితీసేందుకు అనుమతి ఇవ్వబోమన్న షరతుతో 2016లోనే రాష్ట్ర అటవీశాఖ ఆదేశాలు జారీ చేసిందని కేటీఆర్ వెల్లడించారు. నల్లమలలో మైనింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కేటీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో భారీ పేలుడు..8 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు







