రెక్లెస్ డ్రైవింగ్: ఆసియా ట్రక్కర్కి రెండు నెలల జైలు
- September 16, 2019బహ్రెయిన్: ఆసియాకి చెందిన ట్రక్ డ్రైవర్ ఒకరికి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకుగాను 2 నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఇస్తిక్లాల్ హైవేపై సనద్ వద్ద ప్రమాదకరంగా నిందితుడు వాహనాన్ని నడిపినట్లు అభియోగాలు నిరూపించబడ్డాయి. ట్రాఫిక్ ప్రాసిక్యూషన్ చీఫ్ ప్రాసిక్యూటర్ హుస్సేన్ అల్ సైరాఫి మాట్లాడుతూ, నిర్దేశిత స్పీడ్ లిమిట్‌ని మించి అతి ప్రమాదకరంగా నిందితుడు వాహనాన్ని నడిపాడని చెప్పారు. ఈ మేరకు ఓ వీడియో ఆన్లైన్లో హల్చల్ చేయడంతో, నిందితుడ్ని పట్టుకుని విచారణ జరిపారు. ఎమర్జన్సీ లేన్ని వినియోగిస్తూ ఇతర వాహనాల్ని ప్రమాదకరంగా దాటుకుని ముందుకు వెళ్ళినట్లు నిందితుడిపై అభియోగాలు నిరూపించబడ్డాయి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ