ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని మిగేన్సింది
- September 17, 2019
అమెరికా:ఏమిటే ఆ పగటి కలలు.. చేసే పని మీద కాస్త శ్రద్ద పెట్టు.. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటావు.. ఏం చేస్తున్నావో కాస్తయినా అర్థమవుతోందా.. అమ్మ ఎన్ని సార్లు చీవాట్లు పెట్టినా ఆమె చెవికెక్కలేదు. పగటి కల సరే.. మరి రాత్రి పూట వచ్చిన కలలో ఏం చేసిందో తెలిసి షాక్ తిన్నారు యువతి పేరెంట్స్. తనని చేసుకోబోయే వరుడు తన వేలికి పెట్టిన రింగ్‌ని కాపాడుకునే ప్రయత్నంలో మింగేసింది. నిజంగా కాదు కలలో అనుకుంది. తెల్లారి లేచి బెడ్ అంతా వెతికింది. ఎక్కడా రింగ్ కనిపించక పోయేసరికి దోచుకుపోయింది దొంగలు కాదు తనే మింగేసానని తెలుసుకుంది.
క్యాలిఫోర్నియాకు చెందిన జెన్నా ఈవన్స్ అనే యువతికి.. బాబ్ హోవెల్ అనే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఎంగేజ్‌మెంట్‌లో జెన్నా వేలికి రింగ్ తొడిగాడు హోవెల్. పెళ్లికి ఇంకా పది రోజులు టైమ్ ఉండడంతో రోజూ పడుకునే ముందు తన ఫియాన్సీ తొడిగిన రింగ్‌ని ముద్దు పెట్టుకుని నిద్రపోయేది జెన్నా. ఇదిలా ఉండగా ఓ రోజు రాత్రి నిద్రపోతుంటే కల వచ్చింది జెన్నాకి. అందులో హోవెల్, జెన్నా హైస్పీడ్ ట్రైన్‌లో వెళుతున్నారు. ఇంతలో కొందరు దుండగలు వారిపై దాడి చేసి జెన్నా చేతికి ఉన్న రింగ్‌ని కొట్టేయబోయారు. దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆమె దాన్ని మింగేసింది.
తెల్లారి లేచి చూసుకుంటే వేలికి రింగ్ లేదు. రాత్రి నిద్రలో తనకు వచ్చిన కల గుర్తుకు వచ్చింది. నిజానికి కలలు అందరూ కంటారు కానీ గుర్తుండవు. అయితే జెన్నాకు మాత్రం కల మొత్తం స్పష్టంగా కళ్లకు కట్టినట్లు కనిపించింది. దొంగలు, ట్రైను, హోవెల్ ఎవరూ లేరు కానీ రింగు మింగిన మాట వాస్తవం. వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెట్టింది. డాక్టర్లు ఎక్స్‌రే తీసి అమ్మాయి కడుపులో రింగు ఉందని నిర్దారించుకున్నారు. ఎండోస్కోపీ చేసి ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని బయటకు తీశారు. ఇదంతా జెన్నా తన ఫేస్ బుక్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో ఈ వార్త వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







