తడిసి ముద్దయిన బెజవాడ
- September 17, 2019
విజయవాడ:అరగంట పాటు ఆగకుండా కురిసిన వర్షానికి విజయవాడ తడిసి ముద్దయింది .ప్రధాన రహదారులు జలమయమయ్యాయి .చిన్నపాటి చెరువులను తలపించాయి. కొద్దిపాటి వర్షానికే నగరంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారులు జలమయం కాగా, ప్రధాన కూడళ్లు చెరువులను తలపించాయి. డ్రైనేజీ వాటర్‌తో కలిసి వర్షపు నీరు రోడ్లపైకి వచ్చేయటంతో వాహన చోదకులు ,పాదచారులు నానా అవస్థలు పడ్డారు. సైలెన్సర్లు నీట మునగటంతో ద్విచక్ర వాహనాలు ముందుకు కదిలేందుకు మొరాయించాయి. ఇక డ్రైనేజ్ నీళ్లు, వర్షం నీటితో కలిపి రోడ్లపైకి వచ్చేయడంతో దుర్గంధం వెలువడుతోంది. దీంతో పాదచారులు ఇబ్బందులు పడ్డారు.
కృష్ణా, గుంటూరులో భారీ వర్షం : ఇక కృష్ణాజిల్లా గన్నవరం, నందిగామలో భారీ వర్షం పడింది. రోడ్లన్నీ జలమయం కావడంతో డ్రైనేజ్‌లు పొంగి పొర్లుతున్నాయి. వర్షపు నీటితో పల్లపు ప్రాంతాలో చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. అలాగే గుంటూరు జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. రహదారులు అన్ని జలమయం అయ్యాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు