తగ్గిన బంగారం ధర
- September 21, 2019
బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడం, బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరచకపోవడం దీనికి కారణంగా చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర 0.04 శాతం తగ్గి రూ.37,670గా ఉంది. గత నెలలో రూ.39,885కు పెరిగి రికార్డ్ స్థాయికి చేరుకుంది. అయితే అది ఇప్పుడు రూ.2,200కు తగ్గి 37,670కి చేరుకుంది. ఇదిలా ఉండగా వెండి ధర కూడా రూ.0.04 శాతం తగ్గి రూ.46,626కు పడిపోయింది. వెండి గత నెలలో రికార్డ్ స్థాయిలో రూ.51,489కి చేరుకుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 1,503 గా ఉంది. వెండి ధర ఔన్సుకు 17.97 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గినప్పటికీ ఈ తగ్గుదల ఇలాగే ఉండకపోవచ్చనే అనుమానాలు ఉన్నాయి.
ప్రముఖ నగరాల్లో బంగారం ధరల విషయాన్ని పరిశీలిస్తే..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.35,830.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.39,020
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం 36,500.. 24 క్యారెట్ల బంగారం 37,500
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 36,600, 24 క్యారెట్ల బంగారం 37,710
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 36,800, 24 క్యారెట్ల బంగారం 38,050
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 35,150, 24 క్యారెట్ల బంగారం 38,340
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 35,830, 24 క్యారెట్ల బంగారం 39,020
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 35,830, 24 క్యారెట్ల బంగారం 39,020
విశాఖలో 22 క్యారెట్ల బంగారం 35,830, 24 క్యారెట్ల బంగారం 39,020 గా ఉంది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







