కాస్ట్లీ మెసేజ్: మీ ఏటీఎం కార్డ్ రద్దు
- September 23, 2019
కువైట్: 'డియర్ కస్టమర్.. మీ ఏటీఎం కార్డ్ ర్దయ్యింది. ఈ నెంబర్‌కి ఫోన్ చేసి మీ వివరాలు అప్డేట్ చేసుకోండి..' అంటూ వచ్చే మెసేజ్, ఓ వలసదారుడి బ్యాంక్ అకౌంట్ నుంచి 1000కి పైగా దినార్లు మాయమయ్యేలా చేసింది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌కి మెసేజ్ రాగానే, వెంటనే ఆ మెసేజ్‌కి అనుగుణంగా తాను వివరాల్ని అప్డేట్ చేశాననీ, ఆ తర్వాత తన అకౌంట్ నుంచి మూడు విడతలుగా డబ్బు తనకు తెలియకుండా డ్రా అయ్యిందని వాపోయాడు బాధితుడు. బ్యాంకుని సంప్రదిస్తే, గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఆ మెసేజ్ వచ్చినట్లు నిర్ధారించారనీ, అది బ్యాంకు ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారం కాదని చెప్పారంటున్నారు బాధిత వ్యక్తి. ఈ కేసుని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇ-క్రైమ్స్ డిపార్ట్మెంట్కి అప్పగించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







