అమెరికాలో ఇమ్రాన్‌ఖాన్‌కు చేదు అనుభవం!
- September 25, 2019
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. స్వయంగా అమెరికా అధ్యక్షుని చేతిలోనే ఇమ్రాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇమ్రాన్ సమక్షంలోనే పాకిస్థాన్ రిపోర్టర్‌ను చెడామడా తిట్టేశారు. ఇలాంటి వారిని ఎక్కడి నుంచి పట్టుకొస్తారని నేరుగా ఇమ్రాన్‌ఖాన్‌నే ప్రశ్నించారు. ట్రంప్ వ్యాఖ్యతో పాక్ ప్రధాని ముఖం చిన్నబోయింది.
ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా ట్రంప్, ఇమ్రాన్ ఖాన్‌లు సమావే శమ్యయారు. అనంతరం జరిగిన మీడియా మీటింగ్‌లో పాకిస్థాన్ రిపోర్టర్ ఒక రు కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. కశ్మీర్ విషయంలో ట్రంప్ అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. పదే పదే కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించ డంతో ట్రంప్ విసిగిపోయారు. పాక్ రిపోర్టర్‌పై మండిపడిన ట్రంప్, నీవు ఇమ్రాన్ టీంకు చెందిన వ్యక్తివా అని ప్రశ్నించారు. పాకిస్థాన్ రిపోర్టర్ ఎదురుగానే తనను అవమానించడంతో ఇమ్రాన్ ఖాన్ ముఖం వాడిపోయింది. చేసేదేం లేక ఒక నవ్వు నవ్వి ఊరుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







