మునిగిన బోటు.. ఓ వ్యక్తి గల్లంతు

- September 25, 2019 , by Maagulf
మునిగిన బోటు.. ఓ వ్యక్తి గల్లంతు

మస్కట్‌: ఓ వ్యక్తి దుక్మ్‌ సముద్రంలో గల్లంతయ్యారు. రెస్క్యూ టీమ్స్‌ ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ ఈ విషయాల్ని వెల్లడించింది. ఇద్దరు వ్యక్తులు బోటులో వెళుతుండగా, ప్రమాదవశాత్తూ బోటు తిరగబడిందనీ, అందులో ఓ వ్యక్తి బయటపడగా మరో వ్యక్తి గల్లంతయినట్లు తమకు ఫిర్యాదు అందిందనీ, వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్‌ సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అల్‌ వుస్తా గవర్నరేట్‌ పరిధిలోని దుక్మ్‌ పోర్ట్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com