హైదరాబాద్:మాయలేడి కొత్త తరహా మోసం!

- September 25, 2019 , by Maagulf
హైదరాబాద్:మాయలేడి కొత్త తరహా మోసం!

హైదరాబాద్‌లో కొత్త తరహా మోసానికి తెరలేపింది ఓ సైబర్‌ లేడి. నగరంలోని పలు స్కూల్స్‌కి చెందిన అఫిషియల్ ఫేస్‌బుక్‌ నుంచి ఫోటోలు డౌన్‌లోడ్‌ చేసి.. వాటిని మార్ఫింగ్ చేస్తోంది. ఆ తర్వాత ఆ ఫోటోలను బాధితులకు పంపి బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తోంది. తాను సైబర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్న ఈ కిలాడీ .. ఫోటోలు తీసేస్తానంటూ డబ్బులు వసూలు చేసింది. బాధితులు సైబర్ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఫోన్లో దాదాపు 225కు పైగా స్కూళ్ల వివరాలు ఉన్నట్లు గుర్తించారు. ఉన్నత చదువులు చదివిన ఈ మాయలేడి.. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కినట్లు.. పోలీసులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com