టాయిలెట్‌లో ఫోన్ వాడితే ఈ వ్యాధి రావటం ఖాయం!
- September 27, 2019
ఒక్క క్షణం ఫోన్ కనిపించకపోతే.. ప్రళయం ముంచుకొస్తున్నంత కంగారు వస్తుంది. పని ఉన్నా లేకపోయినా అది నిత్యం చేతిలో ఉండాల్సిందే. చివరికి.. టాయిలెట్‌కు వెళ్లినా సరే అది తోడు రావల్సిందే. లేకపోతే.. ఏదో వెలితిగా ఉంటుంది. ఒక పక్క ‘ఆ పని’ పూర్తి చేస్తూనే మరో పక్క.. మొబైల్‌తో టైంపాస్ చేయడం నేటి యువతకు అలవాటు.
అయితే, అలవాటు మీకు కొత్త రోగాలను అంటగడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌కు చెందిన ఓ సర్వే ప్రకారం.. ఆ దేశానికి చెందిన యువతలో 57 శాతం మంది టాయిలెట్లో సైతం మొబైల్‌తోనే టైంపాస్ చేస్తున్నారని పేర్కొంది. ఒక వైపు ఫోన్ చూస్తూనే మరోవైపు విసర్జన పని పూర్తిచేస్తామని యువత అంగీకరించారని తెలిపింది.
ఇలా టాయిలెట్లలో ఫోన్‌తో గడపడం వల్ల మూలశంక వ్యాధి (పైల్స్) ఏర్పడుతుందని, పిరుదుల్లో మొలలు పుట్టుకొస్తాయి. ఈ సర్వేపై పేషెంట్ డాట్ ఇన్ఫో డైరెక్టర్ డాక్టర్ సారా జర్వీస్ మాట్లాడుతూ.. ‘‘టాయిలెట్‌నూ మొబైల్ ఫోన్ వాడటం వల్ల అవసరం కంటే ఎక్కువ సేపు అందులో కూర్చుంటారు. దీనివల్ల పెద్ద పేగు చివరి భాగంలో గల పాయువులోని సిరలపై ఒత్తిడి పడుతుంది’’ అని తెలిపారు.
‘‘మలబద్ధకం, మొలలు సమస్య వల్ల భవిష్యత్తులో కూర్చోడానికే ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ భాగం పుండులా మారుతుంది. ఒక్కోసారి రక్తస్రావం కూడా జరుగుతుంది. విసర్జనకు వెళ్లాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. గర్బిణీ స్త్రీలు, దీర్ఘకాలిక దగ్గు, వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్య యుక్త వయస్సులోనే ఏర్పడే అవకాశాలు ఉన్నాయి’’ అని సారా పేర్కొన్నారు.
‘‘పిరుదులపై దురద, విసర్జన రంగు ఎర్రగా మారడం, విసర్జన పూర్తయినా ఇంకా వస్తున్నట్లే అనిపించడం, చీము రావడం వంటి లక్షణాలు కనిపించినట్లయితే.. అవి మూలశంఖకు సంకేతాలని భావించాలి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. బాధితులు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. నిత్యం వ్యాయామం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా.. మీ మొబైల్ ఫోన్‌ను బయట పెట్టి ప్రశాంతంగా టాయిలెట్‌లో కూర్చోండి’’ అని తెలిపారు. చూశారుగా.. ఇకపై టాయిలెట్‌లోకి వెళ్లినప్పుడు ఈ సూచలను తప్పకుండా గుర్తుంచుకోండి. లేకపోతే భవిష్యత్తులో కూర్చోడానికి కూడా ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు







