ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్..
- September 27, 2019
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త అందిస్తోంది. బ్యాంక్ జారీ చేసే రుణాలకు ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించింది. ఫ్లోటింగ్ రేటు ఎంఎస్ఎంఈ రుణాలు, హోమ్ లోన్స్, రిటైల్ రుణాలకు ఇది వర్తిస్తుంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వస్తుంది. మార్కెట్ వడ్డీ రేటు ప్రాతిపదికన బ్యాంకులు కస్టమర్లకు రుణాలు జారీ చేయవచ్చు. ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణాల జారీ విధానాన్ని వాలంటరీ ప్రాతిపదికన ఇప్పుడు ఎస్బీఐ కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. సూక్ష, స్థూల మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఇక రేపో ఆధారిత ఫ్లోటింగ్ రేటు హోమ్‌లోన్స్‌కు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవి 2019 జులై 1 నుంచి అమలులో ఉన్నప్పటికీ, వాటిలో కూడా స్వల్ప మార్పులు చేసింది. అది కూడా అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం







