బంగారం ధరకు బ్రేకు..
- September 27, 2019
బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ మార్కెట్ అంచనాలను తలకిందులు చేస్తుంటాయి. గత వారం రోజుల పసిడి ధరలను పరిశీలిస్తే పోయిన వారం కంటే ఈ వారం మరి కొంత తగ్గి కొనుగోలు దారులను ఆకర్షిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఏకంగా రూ.400 తగ్గి రూ.39,250కు దిగొచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గుదలతో రూ.35,970కు పడిపోయింది. బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తోంది. కేజీ వెండి ధర రూ.50,050కు క్షీణించింది. అదే ఢిల్లీ మార్కెట్లో అయితే పది గ్రాముల బంగారం 24 క్యారెట్లు ఉన్నది రూ.400 తగ్గి రూ.37,950కు దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.36,750కి క్షీణించింది. అక్కడ కూడా పసిడి ధరతో పాటే వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో బలహీనమైన ట్రెడ్ సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో పసిడి ధరల పరిస్థితి కూడా ఇలాగే కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు