నా కనుసన్నల్లోనే జర్నలిస్ట్ ఖషోగీ హత్య--సౌదీ ప్రిన్స్
- September 27, 2019
రియాద్: గత ఏడాది టర్కీలోని సౌదీ దౌత్య కార్యాలయంలో జరిగిన జర్నలిస్టు జమాల్ ఖషోగీ హత్యలో తన పాత్ర గురించి సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఎట్టకేలకు అంగీకరించారు. ఈ హత్య తన కనుసన్నల్లోనే జరిగిందని ఆయన చెప్పారు. వచ్చే వారం మీడియాలో ప్రసారం కానున్న ఒక డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ హత్యకు తాను బాధ్యత వహిస్తున్నానన్నారు. ఖషోగీ హత్యకు సల్మాన్ ఆదేశించినట్లు సిఐఎ, కొన్ని పశ్చిమ దేశాలు చెబుతుండగా, ఇందులో ఆయన పాత్రేమీ లేదని సౌదీ యువరాజు బుకాయిస్తూ వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ఈ హత్య కేసులో అనుమానపు ముల్లు సౌదీ యువరాజువైపే చూపిస్తున్నది. 'ది క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ సౌదీ అరేబియా' పేరుతో రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీ చిత్ర బృందంతో ఆయన మాట్లాడుతూ, ఈ హత్య తన కనుసన్నల్లోనే జరిగిందని, ఇందుకు తానే పూర్తి బాధ్యత వహిస్తానన్నారు.
ఖషోగీ హత్య జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంలో ఈ డాక్యుమెంటరీ అక్టోబర్ ఒకటిన సౌదీ మీడియాలో ప్రసారం కానుంది. విచారణలో ఈ హత్యతో తనకు ఏమాత్రం సంబంధం లేదని బుకాయించిన సౌదీ యువరాజు తమ ప్రభుత్వంలోని కొందరు మూర్ఖపు అధికారులు ఈ హత్యకు పాల్పడ్డారని చెప్పారు. 'మీ ప్రమేయం లేకుండా ఈ హత్య ఎలా జరుగుతుంద'న్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ తమ దేశంలో రెండు కోట్ల మంది ప్రజలు, 30 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు వున్నారన్నారు.
హంతకులను ప్రభుత్వమే ప్రైవేటు విమానాల్లో తీసుకెళ్లిందా అన్న ప్రశ్నకు 'ఈ పనులు చేసేందుకు తమ వద్ద అనేక మంది అధికారులు మంత్రులు వున్నారని, వారే బాధ్యత వహిస్తారని చెప్పారు. ఇందుకు వారికి అవసరమైన అధికారాలున్నాయన్నారు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!