ప్రవాస కార్మికులను తమ వద్దనే ఉంచుకోవాలని ఒమాన్ ప్రభుత్వానికి వినతి

- January 10, 2016 , by Maagulf
ప్రవాస కార్మికులను తమ వద్దనే ఉంచుకోవాలని ఒమాన్ ప్రభుత్వానికి వినతి

ఆర్ధిక మాంద్యం 2016 మొత్తం కొనసాగుతున్నప్పటికీ...ఒమాన్ దేశాభివృద్ధిలో వెన్నెముకగా ఉన్న ప్రవాస  కార్మికులను తమ దేశం నుంచి పంపించరాదని కొందరు ఆర్ధికవేత్తలు సుల్తానేట్ అఫ్ ఒమాన్ కు సలహను ఇస్తున్నారు. స్వదెశస్థులతో ఒమానీకరణను బలోపేతం చేయడానికి ఇది సరైన సమయం  కాదని , దేశం ఎదుర్కొంటున్నఆర్ధిక కష్టాలను ఓర్పుతో భరించి ఉన్న సహజ , మానవ ఒనరులను  కాపాడుకోవాలని ,  ఆర్ధిక మాంద్యంను సవాలుగా తీసుకోవాల్సిన సమ ఆసన్నమైందని అన్నారు. జులై 2014 ఏడాదితో సరిపోలిస్తే , గత ఏడాది చమురు ధరల పతనం కారణంగా ప్రభుత్వ ఆదాయం 60 శాతం మేరకు తగ్గే అవకాశం ఉంది. పెట్రో కెమికల్ రంగంలో వచ్చిన తీవ్ర ఒడిదుడుకుల కారణంగా పలు దేశాలు కుదేలు పడినప్పటకీ , మంచి వ్యూహాలతో తమ స్థిరత్వాన్న్ని కొనసాగించినట్లు గమనించవచ్చని తెలిపారు. గత దశాబ్ద కాలంగా ఇరాన్ సైతం ఒమాన్ తరహ ఆర్ధిక మాంద్యం ఎదుర్కొందని ప్రస్తుతం ఆ దేశ అనుభవాలు పరిగణన లోనికి తీసుకొని ఆర్ధికంగా నిలదొక్కుకోవాలని పిలుపు నిచ్చారు. ఒమాన్ కేవలం చమురు, సహజ వాయువు రంగాల వైపునే కాక ,ఇతర ప్రత్యామ్నాయ  రంగాలపై సైతం దృష్టిని కేంద్రీకరించాల్సిన సమయం ఆసన్నమైనదని  అన్నారు. గనులు , వ్యవసాయం , మత్స్య పరిశ్రమ రంగాల వైపు ఒమాన్ దేశం దృష్టిని కేంద్రీకరించాలని తెలిపారు. అలాగే,  విసృత అవకాశాలు ఉన్న పర్యాటక శాఖ ను ప్రోత్సా హించాలని కోరారు. ఒమానీకరణ కారణంగా ప్రవాస ఉద్యోగులకు ఏ విధంగా నష్టం ? ఒమాన్ లో 1.8 మిలియన్ విదేశీ కార్మికులలో 30 శాతం మంది రానున్న కొద్ది కాలంలో దేశం విడిచిపొవాల్సిన పరస్థితి రానుంది. దీనితో స్థానిక మార్కెట్లో కొనుగోలు శక్తీ తగ్గే అవకాశం ఏర్పడనుంది.అలాగే పలు వ్యాపారాలు కుంటుపడే పెద్ద తరహ మార్కెట్లు సైతం దెబ్బతిననున్నాయి. స్వల్ప పెట్టుబడులతో నిర్వహించబడే మధ్యస్థ సంస్థలు ఒమాన్ లో బోర్లా పడతాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తమ వద్ద పని చేస్తున్న ఉద్యోగులు సైతం విదేశీయులు కాబట్టి రెండు విధాలుగా  స్థానిక వ్యాపారులు నష్టపోతారని  వారు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు ఒమాన్ కార్మిక మంత్రిత్వ శాఖ విదేశీ కార్మికులకు ఉపాధి వీసాలను ఇచ్చేందుకు ప్రోత్సాహించడం లేదు. ఈ ఉద్యోగ ఖాళీలను ఒమాన్  పౌరులతో భర్తీ చేసేందుకు యోచించడం సరి కాదని సూచించారు. గతం నుంచి ఒమాన్ దేశ ఆర్ధిక వ్యవస్థ ను బలోపేతం చేసిన విదేశీ కార్మికులను కష్ట కాలంలో వదిలివేయడం ఏ మేరకు న్యాయమో యొచించాలసిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. విదెశి కార్మికులే కనుక తమ తమ స్వలాభం చూసుకొని ఉద్యోగభద్రత లేని దేశం లో ఎందుకు ఉండాలని వారు పునరాలోచించి ఒమాన్ దేశం విడిచి వెళ్ళిపోతే , ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. రానున్న 12 నెలల కాలంలో ఏమి  సంభవించినా , అది ఉద్యోగులకు , కార్మికులకు గడ్డు కాలంగా మారనుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com