బ్యాడ్ న్యూస్ : ఈ స్మార్ట్ ఫోన్లపై వాట్సాప్ ఇక పని చేయదు
- September 30, 2019
ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ దైనందిత జీవితంలో ఓ భాగమైపోయింది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లను చూడకుండా ఉండలేము. అంతలా వాట్సాప్ మనిషి జీవితంతో ముడిపడిపోయింది. అయితే వాట్సాప్ ఇక కనిపించదు అని తెలిస్తే పరిస్థితేంటి..? అసలు ఆ వార్తను జీర్ణించుకోగలరా..? ఆ వార్తను కలలో కూడా వినాలనుకోరు. అంతలా మమేకమైపోయింది. కానీ ఇది నిజం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి వాట్సాప్ ఉండదట. అయితే ఇందులో ఓ ట్విస్టు ఉంది.
ఇది కొన్ని స్మార్ట్ ఫోన్లలో మాత్రమే. పాత స్మార్ట్ ఫోన్లు లేదా అప్డేట్ కానీ ఫోన్లు వినియోగిస్తున్నట్లయితే అలాంటి ఫోన్లలో వాట్సాప్ ఇక కనిపించదు లేదా సపోర్ట్ చేయదు. అయితే అందరికీ ఓ సందేహం కలగొచ్చు. పాత స్మార్ట్ ఫోన్లు అంటే ఎలాంటి మోడల్స్ అని. ఇందుకు వాట్సాప్ సంస్థ వివరణ ఇచ్చింది. ఐఓఎస్ 8 లేదా ఆండ్రాయిడ్ వర్షన్ 2.3.7లాంటి పాత స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నట్లయితే ఫిబ్రవరి 2020 నుంచి వాట్సాప్ ఈ మోడల్ స్మార్ట్ ఫోన్లలో పనిచేయదని స్పష్టం చేసింది.
ఇక వాట్సాప్ అప్డేటెడ్ వర్షెన్ అంటే అన్ని ఫీచర్లు కలిగి ఉన్న వాట్సాప్ కావాలంటే లేటెస్ట్ సాఫ్ట్వేర్లను సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లను వినియోగించాలని వాట్సాప్ సూచిస్తోంది . ఇంకా పాత మోడల్ ఐఫోన్ వినియోగిస్తున్నట్లయితే యాపిల్ సపోర్టు వెబ్‌సైట్‌ను లాగిన్ అయి మీ ఐఫోనును లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో అప్డేట్ చేసుకోవాలని వాట్సాప్ సంస్థ చెబుతోంది. ఇదిలా ఉంటే అన్‌లాక్ లేదా మోడిఫై అయిన ఐఫోన్లు పక్కాగా వాట్సాప్‌ను సపోర్ట్ చేస్తాయని చెప్పలేమని సంస్థ వెల్లడించింది. ఎందుకంటే మార్పులు చేసిన ఐఫోన్లు డివైస్ పనితీరుపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని వెల్లడించింది. అదే సమయంలో ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టంలో మార్పులు జరిగి ఉంటే దానికి సపోర్ట్ ఇవ్వలేమని వాట్సాప్ వెల్లడించింది.
2020 ఫిబ్రవరి నుంచి వాట్సాప్ బంద్ కాకుండా ఉండాలంటే ముందుగానే జాగ్రత్త పడి సాఫ్ట్ వేర్‌ను అప్డేట్ చేసుకోవాలని వాట్సాప్ తన సపోర్ట్ పేజ్‌పై రాసుకొచ్చింది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..