మలేసియా నుండి కోమా పేషేంటును ఇప్పుడే పంపలేము:భారత రాయబార కార్యాలయం
- October 01, 2019
మలేషియా:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తాళ్ల ధర్మారం గ్రామానికి చెందిన తట్ర రాజం అనే యువకునికి మలేసియాలో పనిప్రదేశంలో తలకు దెబ్బ తగిలి కోమాలోకి (అపస్మారక స్థితి) లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అతనికి మెరుగైన వైద్యం అందించి స్వదేశానికి పంపించాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్ది మలేసియా రాజధాని కౌలాలంపూర్ లోని ఇండియన్ హైకమీషన్ కు ఇ-మెయిల్ ద్వారా, ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మలేషియాలోని భారత దౌత్యాధికారులు లక్ష్మీకాంత్ కుంబర్, నిషిత్ కుమార్ ఉజ్వల్ లు స్పందించి మంగళవారం (01.10.2019) భీంరెడ్డికి జవాబు ఇచ్చారు.
కోమాలో ఉన్న పేషేంటు ప్రస్తుత స్థితి ప్రయాణానికి అనువుగాలేదని ఆసుపత్రివారు తెలిపారని, ఇదే విషయాన్ని స్థానికి తెలుగు సంఘం ద్వారా ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులకు తెలియపర్చామని దౌత్యాధికారులు వివరించారు.

తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







