పాక్‌ కోసం యుద్ధ నౌక తయారుచేస్తున్న టర్కీ

- October 02, 2019 , by Maagulf
పాక్‌ కోసం యుద్ధ నౌక తయారుచేస్తున్న టర్కీ

టర్కీ: గత ఏడాది కుదిరిన ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్‌కు అమ్మేందుకు టర్కీ ఒక యుద్ధ నౌక నిర్మాణాన్ని ప్రారంభించింది. పాక్‌కు అమ్మే యుద్ధ నౌకకు మిల్జెమ్ అనే పేరు పెట్టారు. ఈ యుద్ధనౌక నిర్మాణం ప్రారంభించిన సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ పాల్గొన్నారు. టర్కీ నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌక వల్ల పాకిస్తాన్‌కు మంచి ప్రయోజనం చేకూరగలదని ఆశిస్తున్నట్లు అధ్యక్షుడు పేర్కొన్నట్లు అక్కడి పత్రికలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో పాకిస్తాన్ నేవీ కమాండర్ అడ్మిరల్ జాఫర్ మహమూద్ అబ్బాసీ కూడా పాల్గొన్నారు. మిల్జెమ్ యుద్ధ నౌక పొడవు 99 మీటర్లు ఉంటుంది. 24,000 టన్నుల బరువును మోయగల సామర్ధ్యం ఉన్న ఈ యుద్ధనౌక గంటకు 29 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com