సౌదీ అరేబియాలో విద్యుదాఘాతంతో కేరళ యువకుడు మృతి
- October 04, 2019
సౌదీ అరేబియా:సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో కేరళ యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కేరళలోని మలప్పురం జిల్లా వాసి ఇషాఖాలి మెలేదాత్(30) జెడ్డాలో ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో విధుల్లో ఉండగా ఇషాఖాలి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురయ్యాడు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అతడి మరణ వార్త తెలుసుకున్న జెడ్డా కేఎంసీసీ సంక్షేమ విభాగం నేతలు ముహ్మద్ కుటీ పనాకద్, జలీల్ ఒఝుకుర్ వెంటనే ఘటనాస్థలికి వెళ్లి అతడి మృతదేహాన్ని సొంతూరికి పంపించే ఏర్పాట్లు చేశారు. మృతుడికి భార్య అమ్నా, కొడుకు అమిన్ షాన్ ఉన్నారు. ఇషాఖాలి మృతితో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. అతడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







