తెలంగాణ:చట్టంలో మార్పులకు శ్రీకారం...

- October 04, 2019 , by Maagulf
తెలంగాణ:చట్టంలో మార్పులకు శ్రీకారం...

తెలంగాణలో తీసుకొచ్చిన చట్టాలలో కొన్ని మార్పులు చేపట్టాలని నిర్ణయించుకున్న సంగతి మనందరికి తెలిసిందే. ఐదు సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ చట్టం విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశంలో పాల్గొన్న ఆయన రాష్ట్రానికి గతంలో కంటే కూడా ఎక్కువ పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే పదకొండు వేలకు పైగా అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఇందులో ఎనిమిది వేల నాలుగు వందలకు పైగా అనుమతులు కార్యరూపం దాల్చాయని చెప్పారు. సుమారు పన్నెండు లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందని వివరించారు. సుమారు పన్నెండు లక్షల మందికి ఉపాధి లభించిందని వివరించారు. రెండుసార్లూ తెలంగాణ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో అగ్ర స్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్రాలతో కలిసి ఒక ఎకనామిక్ విషన్ కోసం పని చేసినప్పుడే దేశ ఆర్థిక ప్రగతి వేగవంతమవుతుందని అన్నారు మంత్రి కేటీఆర్. మరో కొత్త ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్ లు పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నారని రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానంతో దూసుకెళ్తున్నామని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ఏపిలో జపాన్ సహా ఇండియన్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపిస్తున్నాయని గౌతంరెడ్డి వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com