2019 రెండవ క్వార్టర్‌లో 40,000 ఉద్యోగాలు
- October 04, 2019
యూఏఈ: యూఏఈ ప్రైవేట్ సెక్టార్, 2019 రెండో క్వార్టర్‌లో సుమారు 40,000 ఉద్యోగాల్ని కల్పించింది. ఇవి ఫ్రీ జోన్ ఉద్యోగాలకు అదనం. నేషనల్ ఎకానమీ వృద్ధిలో ప్రైవేట్ సెక్టార్ కీలక భూమిక పోషిస్తోందనడానికి ఇదొక నిదర్శనమని ఆయా సంస్థలు పేర్కొంటున్నాయి. తొలి క్వార్టర్‌లో 5.06 మిలియన్ వర్కర్స్ ప్రైవేట్ సెక్టార్‌లో వుండగా, ఆ సంఖ్య రెండో క్వార్టర్ నాటికి 5.1 మిలియన్లకు చేరుకుంది. 2018లో కొత్త ఉద్యోగాల సంఖ్య 137,000గా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ స్టాటిస్టిక్స్‌ని బట్టి తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ అలాగే వివిధ సెక్టార్లలో ఉద్యోగాల కల్పన 5 శాతం నుంచి 8.2 శాతానికి చేరుకుంది. కన్‌స్ట్రక్షన్ అలాగే రియల్ ఎస్టేట్ సెక్టార్స్, యూఏఈ వర్క్ ఫోర్స్‌లో 45.7 శాతం మందికి ఉద్యోగాలు కల్పిస్తుండడం గమనార్హం.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







