పోలీసుల అదుపులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్
- October 05, 2019
హైదరాబాద్:టీవీ9 వ్యవస్థాపకుడు రవిప్రకాశ్‌ని బంజారా హిల్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లిన పదిమంది పోలీసులు బృందం ... కారణం చెప్పకుండా రవిప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఏ సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నారో చెప్పకుండా రవిప్రకాశ్‌ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం బంజారా హీల్స్ ఏసీపీ రవిప్రకాష్‌ను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. రవి ప్రకాష్‌తో పాటు మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని కూడా విచారిస్తున్నారు పోలీసులు.
ఇప్పటికే రవిప్రకాష్ పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. నిధుల గోల్మాల్ సంబంధించి ఒక కేసు నమోదు కాగా టీవీ9 లో ఫండ్‌ను అనధికారికంగా తరలించారన్న ఆరోపణలపై రవి ప్రకాష్‌పై మరో కేసు నమోదైంది. దీంతో పాటు గతంలో టీవీ9 ఆఫీసుకు వెళ్లిన పోలీసులకు విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగాలు కూడా రవిప్రకాష్‌పై ఉన్నాయి. ఈ రెండు కేసులు సంబంధించి అతని పైన ఇప్పటికే 41 crpc కింద నోటీసులిచ్చారు. ఈ రెండింటిలో కూడా గతంలోనే అధికారులు విచారించారు.మరో సారి ఇప్పుడు కారణం చెప్పకుండా రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







