ఆసియా వలసదారుడి బలవన్మరణం

- October 05, 2019 , by Maagulf
ఆసియా వలసదారుడి బలవన్మరణం

కువైట్‌: ఆసియాకి చెందిన వలసదారుడొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. జిలీబ్‌ అల్‌ షుయోక్‌లో ఈ ఘటన జరిగింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్న విషయాన్ని సహచర రూమ్‌మేట్స్‌కి తెలియజేసి ఆ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్‌ పరీక్షల నిమిత్తం తరలించారు. చనిపోవడానికి కొద్ది సమయం ముందు తాను చనిపోతున్న విషయాన్ని రికార్డ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మరణం వెనుక ఇతరత్రా ఎలాంటి అనుమానాలు కనిపించడంలేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. విచారణ మాత్రం కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com