దుబాయ్-హైదరాబాద్ ప్రయాణికుల వద్ద భారీగా బంగారం పట్టివేత
- October 05, 2019
హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అధికారుల వివరాల ప్రకారం దుబాయ్ నుంచి శంషాబాద్‌లో ల్యాండ్ అయిన ఎమిరేట్స్ విమానం నుంచి దిగిన ముగ్గురు ప్రయాణీకులు అనుమానంగా కన్పించడంతో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకొని, విచారించగా.. వారి నుంచి టేప్‌తో చుట్టిన రెండు ప్యాకెట్లు లభించాయి. అందులో 42 ఫారిన్ మార్క్ కలిగిన బంగారు బిస్కెట్లు లభించాయి. బంగారం బరువు 4.9 కిలోలు. దాని విలువ కోటి 85 లక్షలు. ఈ బంగారం 99.9శాతం స్వచ్ఛత కలిగినవిగా అధికారులు తెలిపారు. కస్టమ్స్ చట్టం 1962 ప్రకారం అధికారులు బంగారాన్ని సీజ్ చేశారు. అనుమానితుల వద్ద బంగారం కొన్నట్లుగా గానీ, దిగుమతి చేసుకుంటున్నట్లుగా గానీ ఎలాంటి ధృవ పత్రాలు లేవు. వారు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిర్ధారించుకున్న అధికారులు నిందితులను అరెస్టు చేసి, విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







