అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్
- October 09, 2019
పాకిస్థాన్ అప్పులు అమాంతం పెరిగిపోతున్నాయి. దేశం అప్పుల కుప్పగా మారిందని పలు నివేదికలు వెల్లడించాయి. స్టేట్ బ్యాంక్ డేటా ప్రకారం ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ వచ్చిన ఏడాదిలోపే పాకిస్థాన్ 7లక్షల కోట్ల అప్పు తెచ్చింది.
గతంలో ఎన్నడూ కూడా ఒకే ఏడాది ఈస్థాయిలో అప్పు తీసుకురాలేదు. ఈ ఏడు లక్షల కోట్ల అప్పులో 2.8 లక్షల కోట్ల విదేశాల నుంచి తీసుకుంది. మిగిలిన అప్పును స్వదేశంలోనే సేకరించింది పాక్ ప్రభుత్వం.
ప్రస్తుతం పాకిస్థాన్ మొత్తం అప్పు రూ. 32 లక్షల 24వేల కోట్లకు చేరింది. ఇమ్రాన్ అధికార పగ్గాలు స్వీకరించకముందు పాక్ అప్పు 24 లక్షల 73వేల కోట్లుగా ఉండేది. అయితే పన్నుల వసూలులో మాత్రం పాకిస్థాన్ అనుకున్న లక్ష్యానికి దగ్గరగా రాగలిగింది. ఈ ఏడాది తొలి ఆర్థిక త్రైమాసకానికి లక్ష కోట్ల మేర పన్నుల వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా. 96వేల కోట్లను వసూలు చేసింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







