ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ కి నోబెల్ శాంతి పురస్కారం
- October 11, 2019
పంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్ పీస్ ప్రైజ్ ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ ను వరించింది. నోబెల్ అవార్డుల కమిటీ ఈ రోజు అబీ అహ్మద్ కు శాంతి పురస్కారాన్ని ప్రకటించింది. ఇథియోపియాకు, ఎరిత్రియాకు మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడంలో ఆయన చేసిన కృషికి గాను పురస్కారాన్ని అందిస్తున్నామని తెలిపింది. శాంతిని నెలకొల్పేందుకు, ఎరిత్రియాతో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు ఆయన తీసుకున్న చర్యలు చాలా ఘనమైనవని జ్యూరీ ప్రశంసించింది.
సరిహద్దుకు సంబంధించి ఎరిత్రియాఇథియోపియాకు మధ్య 1998 నుంచి 2000 వరకు యుద్ధం జరిగింది. గత ఏడాది జూలైలో మళ్లీ ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడానికి అబీ చాలా కృషి చేశారు. నోబెల్ పురస్కారం కింద అబీ అహ్మద్ కు 9 లక్షల అమెరికా డాలర్ల నగదు బహుమతి అందుతుంది. స్వీడన్ లోని ఓస్లోలో డిసెంబర్ 10న ఆయనకు శాంతి పురస్కారాన్ని అందజేయనున్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..