ఫోర్బ్స్ లో మళ్లీ అతనిదే మొదటిస్థానం
- October 11, 2019
భారత్ లో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఈ మేరకు ఫోర్బ్స్ మ్యాగజైన్ భారత కుబేరుల జాబితా వెలువరించింది. ఈ జాబితాలో ముఖేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలవడం వరుసగా 12వ సారి. తద్వారా ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తున్న తీరు విశదమవుతోంది. ముఖేశ్ తర్వాత రెండోస్థానంలో అదానీ పోర్ట్స్ యజమాని గౌతమ్ అదానీ నిలిచారు. ముఖేశ్ సంపద విలువను 51.4 బిలియన్ డాలర్లుగా పేర్కొన్న ఫోర్బ్స్, రెండోస్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఆదాయాన్ని 15.7 బిలియన్ డాలర్లుగా చూపింది.
ఇక ఫోర్బ్స్ జాబితాలో అశోక్ లేలాండ్ అధినేతలు హిందూజా బ్రదర్స్ మూడో స్థానంలో, పల్లోంజీ గ్రూప్ యజమాని పల్లోంజీ మిస్త్రీ నాలుగో స్థానంలో, కోటక్ మహీంద్రా బ్యాంక్ అధినేత ఉదయ్ కోటక్ ఐదో స్థానంలో ఉన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







