లేన్‌ ఛేంజ్‌ ఉల్లంఘనలు: 4,000 మందికి పైగా డ్రైవర్స్‌కి జరీమానా

లేన్‌ ఛేంజ్‌ ఉల్లంఘనలు: 4,000 మందికి పైగా డ్రైవర్స్‌కి జరీమానా

యూ.ఏ.ఈ:4000 మందికి పైగా మోటరిస్టులకు లేన్‌ ఛేంజ్‌ ఉల్లంఘనల నేపథ్యంలో ఒక్కొక్కరికి 400 దిర్హామ్‌ల జరీమానా గత ఎనిమిది నెలల్లో విధించినట్లు ట్రాఫిక్‌ అథారిటీస్‌ వెల్లడించాయి. అబుదాబీ ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్స్‌ డైరెక్టరేట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 4,311 ఉల్లంఘనలు రికార్డ్‌ అయినట్లు తెలుస్తోంది. ఇండికేటర్స్‌ వినియోగించకుండా వున్నపళంగా లేన్‌ ఛేంజ్‌ చేసిన డ్రైవర్లకు ఈ జరీమానాలు విధించారు. ఈ కారణంగా అబుదాబీ రోడ్లపై 235 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఓ వ్యక్తి మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు కూడా. ఇదిలా వుంటే, గత ఏడాది లేన్‌ ఛేంజింగ్‌ ఉల్లంఘనలు 17,349 వరకు నమోదయ్యాయి.  

Back to Top