ఫ్లూ వ్యాక్సిన్ క్యాంపెయిన్‌ని ప్రారంభించిన ఖతార్
- October 15, 2019
ఖతార్: వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడంతో 'ఫ్లూ' వేగంగా విస్తరించే అవకాశాన్న నేపథ్యంలో ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, హమాద్ మెడికల్ కార్పొరేషన్ అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్‌తో కలిసి 'యాన్యువల్ ఫైట్ ది ఫ్లూ' నేషన్ వైడ్ క్యాంపెయిన్‌ని ప్రారంభించడం జరిగింది. హెల్త్ అథారిటీస్ 200,000 మందికి ఉచితంగా ఈ వ్యాక్సీన్లను దేశవ్యాప్తంగా అందించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఫ్లూ అనేది కొన్ని సందర్భాల్లో చాలా తీవ్ర రూపం దాల్చుతుందని హెచ్‌ఎంసి వర్గాలు పేర్కొంటున్నాయి. యాన్యువల్ సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్, చాలా ఉపయోగకరమని అధికారులు పేర్కొంటున్నారు. 40 ప్రైవేటు హెల్త్ కేర్ సెంటర్స్ కూడా ఫ్లూ వ్యాక్సీన్‌ని అందిస్తున్నాయి. ఒకరి నుంచి ఇంకొకరికి వేగంగా వ్యాపించే ఫ్లూని నివారించడమే అత్యుత్తమ మార్గమని వైద్యులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







