అల్‌ అఖాల్‌ బస్‌ ప్రమాద బాధితుల్ని పరామర్శించిన మదీనా గవర్నర్‌

అల్‌ అఖాల్‌ బస్‌ ప్రమాద బాధితుల్ని పరామర్శించిన మదీనా గవర్నర్‌

మదీనా: మదీనా గవర్నర్‌ ప్రిన్స్‌ ఫైసల్‌ బిన్‌ సల్మాన్‌ బిన్‌ అబ్దుల్లా అజీజ్‌, కింగ్‌ ఫవాద్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోన్న అల్‌ అఖాల్‌ బస్‌ ప్రమాద బాధితుల్ని పరామర్శించారు. ఈ బస్సు ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాధితులు త్వరితగతిన కోలుకోవాలని ప్రిన్స్‌ సౌద్‌ బిన్‌ ఖాలిద్‌ అల్‌ ఫైసల్‌ ఆకాంక్షించారు. పేషెంట్స్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారాయన. గాయపడ్డవారు త్వరగా కోలుకునేందుకు తగిన వైద్య సహాయం అందించాలని వైద్యులకు సూచించారు.

Back to Top