ఒమన్‌లో ఫ్యామిలీ మెడిసిన్‌ కాన్ఫరెన్స్‌ ప్రారంభం

ఒమన్‌లో ఫ్యామిలీ మెడిసిన్‌ కాన్ఫరెన్స్‌ ప్రారంభం

మస్కట్‌: సుల్తానేట్‌లో తొలి ఫ్యామిలీ మెడిసిన్‌ కాన్ఫరెన్స్‌ 350 మంది పార్టిసిపెంట్స్‌తో ప్రారంభమయ్యింది. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫ్యామిలీ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఫాతియా అల్‌ కస్సాబి మాట్లాడుతూ, ఫ్యామిలీ మెడిసిన్‌ విభాగంలో లేటెస్ట్‌ డెవలప్‌మెంట్స్‌పై పార్టిసిపెంట్స్‌కి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడ్తుందని చెప్పారు. ఒమన్‌ ఫ్యామిలీ మెడిసిన్‌ సొసైటీ, సుల్తాన్‌ కబూస్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌తో కలిసి సంయుక్తంగా ఈ కాన్ఫరెన్స్‌ని నిర్వహిస్తోంది. ఫ్యామిలీ మెడిసిన్‌కి సంబంధించి సైంటిఫిక్‌ పేపర్స్‌ని ఈ సందర్భంగా కాన్ఫరెన్స్‌లో వుంచారు. క్యాన్సర్‌ ప్రివెంటింగ్‌ ప్రోగ్రామ్స్‌, కమ్యూనికబుల్‌ డిసీజెస్‌, న్యూ థెరపీస్‌ ఫర్‌ డయాబెటిస్‌ వంటి విభాగాలకు సంబంధించిన సైంటిఫిక్‌ పేపర్స్‌ పార్టిసిపెంట్స్‌కి అందజేశారు. ఒమన్‌ ఫ్యామిలీ మెడిసిన్‌ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ మహ్రెజి మాట్లాడుతూ, కాన్ఫరెన్స్‌ ద్వారా పార్టిసిపెంట్స్‌ తాము నేర్చుకోవడమే కాకుండా, తమ అనుభవాల్ని ఇతరులతో పంచుకోవడానికి వీలవుతుందని చెప్పారు.  

Back to Top