ఒమన్‌లో పర్యటించనున్న బహ్రెయిన్ అండర్ 16 క్రికెట్ టీమ్
- October 19, 2019
బహ్రెయిన్ అండర్ 16 నేషనల్ రకికెట్ టీమ్, ఒమన్‌లో జరగనున్న ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అండర్ 16 చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొననుంది. అక్టోబర్ 19 నుంచి 30 వరకు ఈ పోటీలు జరుగుతాయి. అఫీషియల్ టూర్ యూనిఫామ్స్, నేషనల్ క్యాప్స్‌ని క్రీడాకారులకు అల్బా క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అందజేశారు. క్రికెట్ బహ్రెయిన్ అసోసియేషన్ అధికారులు, స్పాన్సర్స్ మరియు ప్లేయర్స్ పేరెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిబిఎ సెక్రెటరీ జనరల్ యాసెర్ జాఫర్, క్యాప్స్‌ని ప్లేయర్స్‌కి అందించారు.స్పాన్సర్స్ అయిన రాయల్ బహ్రెయిన్ హాస్పిటల్, ఎక్సెలాన్ మరియు అల్ నమాల్ గ్రూప్‌కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారాయన. అల్బా క్లబ్‌లో గత నాలుగు నెలలుగా యంగ్ క్రికెటర్స్‌కి శిక్షణ ఇవ్వడం జరిగింది. నేషనల్ కోచ్ అజీమ్ ఉల్ హక్ నేతృత్వంలో ఒమ్రాణ్ ఘని, తాహిర్ అన్సారీ, ప్రాచుర్ శుక్లా ఈ శిక్షణ ఇచ్చారు. బహ్రెయిన్ టూమ్, గ్రూప్ ఎలో వుంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







