యూ.ఏ.ఈ లో డెసర్ట్ బైక్ ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతి
- October 19, 2019
అల్ మదాం: యూఏఈలోని అల్ మదాం పట్టణంలో జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం సాయంత్రం షికారుకు వెళ్లిన వారు..డెసర్ట్ బైక్స్ నడుపుతుండగా ఈ ప్రమాదం రాత్రి 07:30లకు జరిగింది. ఓ పెద్ద ఇసుక మేటను ఎక్కేందుకు వారు ప్రయత్నించారని, ఆ సమయంలో వారి వాహనాలు అదుపుతప్పాయని తెలిసింది. దాంతో ఆ వాహనాలు దొర్లుకుంటూ కింద పడ్డాయి. ఈ ప్రమాదంలో మరణించిన ఇద్దరు భారతీయులకు 38ఏళ్ల వయసున్నట్లు పోలీస్ అధికారులు చెప్పారు.మరో ఇద్దరు యువకులకు 20 ఏళ్ళ వయస్సు వారికి తీవ్రంగా గాయాలయ్యాయని, వారిని అల్ ధాయిద్ హాస్పటల్ లో ICU లో చికిత్స అందిస్తున్నారని పోలీస్ అధికారులు వెల్లడించారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదం ఎందుకు జరిగిందో దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..