అబుదాబీ టోల్: జరీమానాలపై 25 శాతం డిస్కౌంట్
- October 21, 2019
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ - అబుదాబీ, టోల్ గేట్స్ దగ్గర నమోదవుతున్న జరీమానాలపై 25 శాతం డిస్కౌంట్‌ని ప్రకటించింది. 30 రోజుల్లోగా చెల్లించేవారికి ఈ తగ్గింపు వర్తిస్తుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఛైర్మన్ షేక్ తాయెబ్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ మేరకు డెసిషన్‌ని జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న టోల్‌గేట్స్‌కి సంబంధించి కొన్ని వెసులుబాట్లు రాబోతున్నాయనీ, జనవరి 1 వరకు ఎలాంటి ఛార్జీలూ వసూలు వాహనాలకి వసూలు చేయబడవనీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం వున్న డైలీ క్యాప్ 16 దిర్హామ్స్‌కి అదనంగా, మంత్లీ లిమిట్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. మోటరిస్ట్ తన తొలి వాహనానికి 200 దిర్హామ్‌లు చెల్లిస్తే సరిపోతుంది. రెండో వాహనానికి 150 దిర్హామ్‌లు, ప్రతి అదనపు వాహనానికి 100 దిర్హామ్‌లు చెల్లించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..