భారత్ మాటలను అవాస్తవమన్న పాకిస్థాన్
- October 21, 2019
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో మూడు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత ఆర్మీ చేసిన ప్రకటనను పాకిస్థాన్ మిలిటరీ కొట్టిపారేసింది. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని భారత ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటన నిరుత్సాహాపరుస్తున్నదని పాక్ మేజరల్ జనరల్ గఫూర్ తెలిపారు. ఒకవేళ ఉగ్ర స్థావరాలు ధ్వంసం అయ్యింది నిజమే అయితే, ఆ ప్రాంతాలకు విదేశీ మీడియోను లేదా దౌత్యవేత్తలను తీసుకువెళ్లి చూపించాలన్నారు. జమ్మూకశ్మీర్‌లోని తంగ్‌దార్, కీరన్ సెక్టార్ల వద్ద భారత ఆర్మీ చేసిన ప్రతీకార దాడుల్లో పది మంది వరకు పాక్ జవాన్లు హతమైనట్లు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆదివారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ మిలిటరీ ప్రతినిధి అసిఫ్ గఫూర్.. తన ట్వీట్‌లో భారత్ వాదనలను తోసిపుచ్చారు. పాక్‌లో ఉన్న భారత ఎంబసీ అధికారులు.. క్యాంపు ప్రాంతాలను విజిట్ చేయవచ్చు అని అన్నారు. స్వదేశీ అవసరాల దృష్టానే రావత్ ఆ కామెంట్ చేశారని, ఇది ప్రొఫెషనల్ మిలిటరీ నైతికతకు వ్యతిరేమని గఫూర్ ఆరోపించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







