అన్నదమ్ములం కదా.. గొడవలు మామూలే అంటున్న ప్రిన్స్ హ్యారీ

- October 21, 2019 , by Maagulf
అన్నదమ్ములం కదా.. గొడవలు మామూలే అంటున్న ప్రిన్స్ హ్యారీ

లండన్‌: తామిద్దరం ప్రస్తుతం వేర్వేరు దారుల్లో నడుస్తున్నటికీ.. ఎల్లప్పుడూ అన్నదమ్ముల బంధం కొనసాగుతుందని ప్రిన్స్‌ హ్యారీ అన్నారు. ప్రతీ బంధంలో చిన్న చిన్న గొడవలు సహజమని.. నేటికీ తాను అన్నయ్యను అమితంగా ప్రేమిస్తున్నానని పేర్కొన్నారు. బ్రిటీష్‌ రాజవంశ సోదరులు ప్రిన్స్‌ విలియం, ప్రిన్స్‌ హ్యారీ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని గత కొంతకాలంగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ప్రస్తుతం.. భార్య మేఘన్‌ మార్కెల్‌తో కలిసి దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న డ్యూక్‌ ఆఫ్‌ ససెక్స్‌ ప్రిన్స్‌ హ్యారీ ఈ విషయాలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ' ఈ క్షణం మేము కచ్చితంగా వేర్వేరు దారుల్లోనే ఉన్నాం. అయితే అత్యవసర సమయాల్లో మేము ఒకరికరం అండగా ఉంటాము. ప్రతిరోజూ నేరుగా కలుసుకోలేకపోవచ్చు కానీ ఆయనను అమితంగా ప్రేమిస్తూనే ఉంటాను. అన్నదమ్ముల మధ్య ప్రేమలు, చిన్న చిన్న గొడవలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతమాత్రాన మా గురించి అసత్యాలు ప్రచారం చేయడం సరికాదు' అని చెప్పుకొచ్చారు.

ఇక దక్షిణాఫ్రికా దేశాల పర్యటన గురించి చెబుతూ ఇది తన మనసుకు సాంత్వన చేకూరుస్తుందని అన్నారు. తన తల్లి ప్రిన్సెస్‌ డయానాను గుర్తు చేసుకునేందుకు.. ఆమె అడుగుజాడల్లో నడిచేందుకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఒక రాజకుటుంబీకుడిగా తాను ప్రతీ క్షణం కెమెరా ముందే ఉంటున్నానని, ప్రతి క్షణం తన ఫొటోలు తీస్తున్నారని.. అయితే ఇదంతా తనను ఒక్కసారిగా గతంలోకి తీసుకువెళ్తుందని పేర్కొన్నారు. తన తల్లి జీవితంపై ఇలాంటివి దుష్ప్రభావం చూపాయని.. తన మరణాన్ని కూడా చెడుగా గుర్తుపెట్టుకునేలా చేశాయని విచారం వ్యక్తం చేశారు. ఆ గాయం తనను నేటికీ వెంటాడుతుందని.. తన జీవితంలో అతిపెద్ద విషాదం అని ఉద్వేగానికి గురయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com