అమ్మానాన్నలను కాదని ప్రియుడితో పరార్.. అనుమానాస్పద స్థితిలో..
- October 21, 2019
అసలే రోజులు బాగలేదు తల్లీ.. ప్రేమా దోమా అంటూ వెంటపడతారు.. అవసరం తీరాక వదిలించుకుంటారు.. పోనీ మీ ప్రేమ నిజమైంది అయితే మీ కాళ్ల మీద మీరు నిలబడ్డాక పెళ్లి చేసుకోండి అంటూ తల్లిదండ్రులు అమ్మాయికి ఎంతో నచ్చచెప్పారు. అయినా ప్రేమమైకంలో పడిన ఆమెకు అమ్మానాన్నల మాటలు చెవికెక్కలేదు. దాంతో నీ ఖర్మ.. అంటూ కూతురి గురించి పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా 23 ఏళ్ల భవిత జీవితం బలైంది. కర్ణాటక హాసన్ పట్టణానికి చెందిన భవిత 18 ఏళ్ల వయసులో పునీత్ అనే యువకుడితో ప్రేమలో పడింది. తల్లిదండ్రులకు విషయం తెలిసి వారించారు. అయినా అతడితో ప్రేమ వ్యవహారం కొనసాగించింది. అతడినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. తాను మేజర్ని అని, తనకు నిర్ణయం తీసుకునే అధికారం ఉందని అమ్మానాన్నలతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లి పోయింది.
దీంతో తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడం మానేశారు. భవిత ఎక్కడ ఉంటుందో ఎలా ఉందో తల్లిదండ్రులకు సమాచారం లేదు. ఇదిలా ఉండగా, ఆదివారం హాసన్ పట్టణంలోని ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మరణించిందన్న వార్త వెలుగు చూసింది. మృతురాలిని అరుకలగూడుకు చెందిన భవితగా పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో యువతి చేయిపై పునీత్ అనిపచ్చబొట్టు ఉన్నట్లు తెలిసింది. అంతే కాకుండా ఇప్పటి వరకు ఆమె ముగ్గురు యువకులను ప్రేమించినట్లు విచారణలో తేలింది. 12 రోజుల ముందు కూడా ఇదే హోటల్‌కు వచ్చినట్లు ఫేస్బుక్లో భవిత పోస్ట్ పెట్టింది. అప్పుడు కూడా ఇదే రూమ్‌లో ఉన్నానని గది ఫోటోలను కూడా అప్లోడ్ చేసింది. శనివారం రాత్రి పునీత్‌తో కలిసి వచ్చిన భవిత ఆదివారం ఉదయానికి విగత జీవిగా పడి ఉండడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!







