నిరసన సెగలు..మెట్రో స్టేషన్లకు నిప్పు
- October 22, 2019
శాంటియాగో : చిలీలో ప్రజలు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. శుక్రవారం రోజున మొదలైన నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో పలువురు మరణించగా.. ఆందోళన చేపడుతున్న వందలాది మందిని అరెస్ట్ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. మెట్రో చార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. జనాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. వేల సంఖ్యలో ప్రజలు చిలీ రాజధాని శాంటియాగోలో ఆందోళనలకు దిగారు.
రోడ్లపైకి వచ్చిన నిరసనకారులు మాస్క్లు ధరించి బీభత్సం సృష్టించారు. పలు చోట్ల బస్సులకు, మెట్రో స్టేషన్లకు, బ్యాంకులకు నిప్పు పెట్టారు. శాంటియాగోలో ఎక్కడ చూసిన మంటలు, దట్టమైన పొగలతో నిండిపోయింది. పలుచోట్ల నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అలాగే బారీగా భద్రతా బలగాలను మోహరించారు. దీంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించడమే కాకుండా.. 15 రోజులపాలు ఎమర్జెన్సీ ప్రకటించింది. కాగా, చిలీలో నియంతృత్వ పాలన ముగిసిన తర్వాత ఇలాంటి హింసాత్మక ఆందోళన చోటుచేసుకోవడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







