రైల్వేస్టేషన్‌లో పేలుడు.. ఉలిక్కిపడిన రైల్వేశాఖ

- October 22, 2019 , by Maagulf
రైల్వేస్టేషన్‌లో పేలుడు.. ఉలిక్కిపడిన రైల్వేశాఖ

బెంగళూరు: కర్ణాటకలోని హుబ్బళ్లి రైల్వేస్టేషన్‌లో సోమవారం ఉలిక్కిపడింది. విజయవాడ నుండి హుబ్బళ్లికి వచ్చిన అమరావతి రైల్లో సీల్‌చేసిన 10 బాక్సుల్లో ఒకదానిని తెరుస్తుండగా జరిగిన పేలుడే ఇందుకు కారణమని తెలుస్తోంది. రైల్వే స్టేషన్‌లో క్యాంటిన్‌ నడుపుకుంటూ పొట్టపోసుకొంటున్న హుసేన్‌సాబ్‌ అనే వ్యక్తితో పోలీసులు బోగిలోని ఓ బాక్స్‌ సీల్‌ తెరిపించారు. సీల్‌ తీస్తుండగానే ఆ బాక్స్‌ ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడుకు హుసేన్‌సాబ్‌తో పాటు ఇద్దరు రైల్వే పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని చికిత్సకొరకు స్థానిక హుబ్బళ్లి రైల్వే ఆస్పత్రికి తరలించారు. రైల్వేస్టేషన్‌లో ఒక్కసారిగా విస్పోటం జరగడంతో రైల్వేశాఖ ఉలిక్కిపడింది. మిగిలిన పోలీసులంతా అక్కడకు పరుగెత్తుకొచ్చారు. డాగ్‌ స్వ్కాడ్స్‌, యాంటి బాంబ్‌స్వ్కాడ్స్‌, రైల్వే భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకొని మిగిలిన బాక్సులను మెటల్‌ డిటెక్టర్‌తో పరిశీలించారు. వాటిలో కూడా పేలుడు పదార్థాలున్నట్లు మెటల్‌ డిటెక్టర్‌ గుర్తించింది.

రైల్వేస్టేషన్‌ చుట్టూ పరిశీలన ప్రారంభించారు. రైల్వే లభించిన 10 అనుమానస్పద బాక్సులు మహారాష్ట్ర కొల్హాపూర్‌ ఎమ్మెల్యే పేరుతో వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. బాక్సులపై ప్రకా్‌షరావు అబిట్‌కర్‌ బుధర్‌ఘడ్‌ ఎమ్మెల్యే, గర్గోటి కొల్హాపుర అనే చిరునామాతో ఉందని హుబ్బళ్లి రైల్వే డివిజన్‌ పోలీసు కమీనరు ఆర్‌.దిలీప్‌, డిసీపి డిఎల్‌.నాగేశ్‌లు చెప్పారు. ఆ పది బాక్సులను పోలీసులు దూర ప్రదేశాల్లో భద్రపరిచారు. హుబ్బళ్లి రైల్వే స్టేషన్‌లో సంభవించిన బాంబ్‌ విస్పోటంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నట్లు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి జగదీష్‌శెట్టర్‌ తెలిపారు. కొప్పళ్‌లో ఆయన దీనిపై మాట్లాడుతూ.. సంఘటనపై పూర్తి వివరాలు లభించినట్లు పోలీసులు దర్యాప్తు చేపట్టారన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com