పుదీనా ఆకులతో ముఖ సౌందర్యం..
- October 25, 2019ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుదీనా అందాన్ని పెంచడానికీ ఎంతో ఉపయోగపడుతుంది. పుదీనా ఆకుల్ని మెత్తగా పేస్టు చేసి అందులో కొంచెం పసుపు కలపండి. ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కున్నాక ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పావుగంటయ్యాక చన్నీళ్లతో కడిగేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది.
గుడ్డులోని తెల్లసొనకు కొన్ని పుదీనా ఆకుల పేస్టు కలిపి దానిని ముఖానికి రాసుకున్నా మచ్చలూ, మొటిమలూ రాకుండా ఉంటాయి. పుదీనాలో ఉండే శాలిసైలిక్ ఆమ్లం మొటిమలు రాకుండా కాపాడుతుంది.
పుదీనా రసానికి, బొప్పాయి రసం కలిపి చర్మ వ్యాధులు వచ్చిన చోట రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పుదీనా చర్మం ముడతలు పడకుండా, త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా చూడటంలో సాయపడుతుంది. చర్మం నునుపు దేలడానికి ఇది పాటించదగిన చిట్కా.
పుదీనా ఆకులతో తయారుచేసిన నూనె మార్కెట్లో దొరుకుతుంది. ఇది జుట్టు చక్కగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. చుండ్రు సమస్య నుంచి బయటపడేస్తుంది. మూడు మీద పొరలు పొరలుగా పొట్టు ఊడకుండా సంరక్షిస్తుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం