యూ.ఏ.ఈ లో స్కూల్స్‌కు దీపావళి సెలవు
- October 25, 2019
యూ.ఏ.ఈ: దీపావళి పండుగ సందర్భంగా యూ.ఏ.ఈలో 62 స్కూల్స్ సెలవు ప్రకటించాయి. ఈ మేరకు నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కేహెచ్‌డీఎ) ఒక ప్రకటన విడుదల చేసింది. దీపావళి పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 27, ఆదివారం రోజు యూ.ఏ.ఈలోని 62 పాఠశాలలు సెలవు ప్రకటించాయని, కొన్ని స్కూల్స్ అక్టోబర్ 28న కూడా హాలీడే ఇచ్చాయని, రెండు రోజులు లీవ్ ఇచ్చిన పాఠశాలలు తిరిగి మంగళవారం తెరుచుకోనున్నాయని పేర్కొంది. ఇండియన్ హై స్కూల్, దుబాయ్ అండ్ మిలీనియం స్కూల్ ఇలా రెండు రోజులు సెలవు ప్రకటించిన జాబితాలో ఉన్నాయి.
అలాగే షార్జాలో కూడా కొన్ని పాఠశాలలు దీపావళి లీవ్ ఇచ్చాయి.ఢిల్లీ ప్రైవేట్ స్కూల్,జీఈఎంఎస్ ఇంగ్లీష్ హై స్కూల్, జీఈఎంఎస్ మిలీనియం స్కూల్ ఆదివారం సెలవు ప్రకటించాయి. దుబాయ్ ఫెస్టివల్ సెంటర్ మాల్ లో స్పెషల్ షో నిర్వహించారు. ఇప్పటికే దుబాయ్ షాపింగ్ మాల్స్ భారీగా దీపావళి ఆఫర్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బంగారు ఆభరణాలపై భారీ ఆఫర్లు తీసుకొచ్చాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!